Shigella Bacteria: షిజెల్లా బ్యాక్టీరియాతో మూడేళ్ల చిన్నారి మృతి.. కేరళలో తీవ్ర కలకలం
Shigella Bacteria: కేరళలో షిజెల్లా బ్యాక్టీరియా సోకి మూడేళ్ల చిన్నారి మరణించింది. కోజికోడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు గురి చేసింది. ఆ చిన్నారితో టచ్‌లోకి వచ్చిన 11 మంది చిన్నారులకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.
కోజికోడ్: కేరళలో షిజెల్లా బ్యాక్టీరియా(Shigella Bacteria) కలకలం రేపుతున్నది. కోజికోడ్ జిల్లాలో ఓ మూడేళ్ల చిన్నారి ఆ బ్యాక్టీరియా సోకి మరణించింది. దీంతో ఆ జిల్లాలో అధికారులు అప్రమత్తం అయ్యారు. కోజికోడ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ ఆదివారం ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. షిజెల్లా బ్యాక్టీరియా సోకిన వారు అధిక ఉష్ణోగ్రతలతో, జ్వరంతో, మూర్ఛ లాంటి లక్షణాలతో బాధపడుతారు. ఆ చిన్నారి ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తొలుత డాక్టర్లు అంచనా వేశారు. కానీ చివరకు షిజెల్లా బ్యాక్టీరియాతో ఇబ్బందిపడుతున్నట్లు గుర్తించారు. ఆ చిన్నారితో టచ్‌లోకి వచ్చిన సుమారు 11 మందికి కూడా బ్యాక్టీరియా సోకినట్లు అంచనా వేశారు.
వేర్వేరు ఆస్పత్రిల్లో ప్రస్తుతం అయిదుగురు చిన్నారులు అబ్జర్వేషన్లో ఉన్నారు. ఆందోళనలు పెరగడంతో వయోవృద్ధులను కూడా డాక్టర్లు పరిశీలిస్తున్నారు. కోజికోడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అంగన్వాడీలను మూసివేశారు. ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. డోర్ టు డోర్ అవేర్నెస్ ప్రచారం నిర్వహిస్తున్నారు. షిజెల్లా బ్యాక్టీరియా సోకిన వారిలో వాంతులు, విరోచనాలు, జ్వరం, కడుపు నొప్పి, మలంలో రక్తం లాంటి సమస్యలతో బాధపడుతారు. పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, కలుషిత నీరు వల్ల షిజెల్లా వ్యాప్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

