Shatrughan Sinha : లోక్సభ ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేస్తుండటంపై సీనియర్ నటుడు, అసన్సోల్ టీఎంసీ అభ్యర్ధి శత్రుఘ్న సిన్హా స్పందించారు.
తాను ప్రధాని నరేంద్ర మోదీని ఓ స్నేహితుడిగా చూస్తానని చెబుతూ ఆయన మెడిటేషన్ కోసం వెళ్లలేదని మీడియా దృష్టిని ఆకర్షించేందుకు వెళ్లారని చెప్పారు. గతంలో 2019 లోక్సభ ఎన్నికల సందర్భంలోనూ మోదీ కేదార్నాథ్ వెళ్లారని గుర్తుచేశారు.
టెలిఫోన్స్, కమ్యూనికేషన్స్, మీడియా ప్రతినిధులతో అన్ని ఏర్పాట్లతో మోదీ ధ్యాన కేంద్రానికి చేరుకున్నారని అన్నారు. ఇది నూతన ప్రచార పోకడ అని కానీ ఇది చాలా ఆలస్యమైందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం మోదీ ఎన్నో ప్రయత్నాలు చేశారని చివరి అస్త్రంగా ధ్యానం పేరుతో మౌన ముద్రను తెరపైకి తీసుకొచ్చారని శత్రుఘ్న సిన్హా అన్నారు.
Read More :
Aam Panna | సమ్మర్ డ్రింక్ : ఆమ్ పన్నాతో ఆరోగ్య ప్రయోజనాలివే..!