న్యూఢిల్లీ: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ పేరు మారింది. ఇక నుంచి తమ పార్టీ పేరును ‘ఎన్సీపీ- శరద్చంద్ర పవార్’గా మారుస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కొత్తపేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అయితే శరద్‌పవార్ పార్టీకి ఇంకా ఎన్నికల గుర్తు కేటాయించ లేదని ఈసీ పేర్కొన్నది.
మర్రి చెట్టు గుర్తును తమకు కేటాయించాలని శరద్ పవార్ వర్గం ఈసీని కోరింది. మహారాష్ట్రలో త్వరలో 6 సీట్లకు జరగనున్న రాజ్యసభ ఎన్నికలలో శరద్ పవార్ వర్గం ఈ పేరుతోనే పోటీలోకి దిగుతుంది. ఎన్సీపీ నుంచి విడిపోయి వేరే వర్గంగా ఏర్పడిన అజిత్ పవార్‌దే అసలైన ఎన్సీపీ అని ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించడంతో పార్టీ పేరు ఎన్సీపీ, ఎన్నికల గుర్తు గడియారం అజిత్ పవార్ వర్గానికి కేటాయించిన విషయం తెలిసిందే.