ముంబై: ఒక ఎమ్మెల్యే తన చేతులకు సంకెళ్లతో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అమెరికాలోని భారతీయ అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి దేశానికి పంపుతున్న తీరుపై ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అమెరికాపై ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు. మహారాష్ట్రలో బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే జితేంద్ర అవద్ (Jitendra Awhad) తన చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. భారతీయ అక్రమ వలసదారుల కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి అమెరికా సైనిక విమానాల్లో పంపిన చర్యపై ఈ మేరకు నిరసన తెలిపారు.
కాగా, ఎమ్మెల్యే జితేంద్ర అవద్ తన చేతులకు సంకెళ్లతో అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్దకు వచ్చారు. ‘అమెరికాలో భారతీయులు అన్యాయాన్ని ఎదుర్కొంటున్న తీరు, వారిని బంధించి బహిష్కరిస్తున్న తీరు, వీసా సమస్యల కారణంగా అమెరికాలో ఏ భారతీయుడు సురక్షితంగా లేడు. అమెరికా గురించి ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు’ అని విమర్శించారు.
మరోవైపు మహారాష్ట్ర ఎమ్మెల్యే జితేంద్ర అవద్‌కు ముందు తొలుత గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత బీహార్‌కు చెందిన సీపీఎం ఎమ్మెల్యేలు సంకెళ్లతో నిరసన తెలిపారు. భారతీయులను అవమానించిన అమెరికా తీరుపై వారు మండిపడ్డారు.
#WATCH | Mumbai: NCP-SCP leader Jitendra Ahwad comes out in handcuffs as he lodges his protest against the deportation of illegal immigrants from the US.
He says, “The way Indians are facing injustice in America and they are being tied and deported, there is a problem of visas,… pic.twitter.com/3o2OHIaiy3
— ANI (@ANI) March 3, 2025