ముంబై: మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar), కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు. తనను ‘అవినీతి రారాజు’గా అభివర్ణించిన అమిత్ షాను ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి కోర్టు నిషేధించిందని గుర్తు చేశారు. శనివారం జరిగిన పార్టీ సమావేశంలో శరద్ పవార్ మాట్లాడారు. ఈ సందర్భంగా అమిత్ షాను లక్ష్యంగా చేసుకున్నారు. ‘కొన్ని రోజుల క్రితం, హోం మంత్రి అమిత్ షా నాపై మాటల దాడి చేశారు. ‘దేశంలోని అవినీతి పరులందరికీ కమాండర్’ అని నన్ను పిలిచారు. విచిత్రమేమిటంటే గుజరాత్ చట్టాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి హోంమంత్రి. దీని కోసం ఆయనను (అమిత్ షా)ను గుజరాత్ నుంచి సుప్రీంకోర్టు నిషేధించింది. అలాంటి వ్యక్తి నుంచి నాకు సర్టిఫికెట్లు అవసరం లేదు. నా గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు’ అని అన్నారు.
కాగా, నాడు సొంత రాష్ట్రం నుంచి కోర్టు నిషేధించిన వ్యక్తి నేడు కేంద్ర హోంమంత్రిగా ఉన్నారని శరద్ పవార్ విమర్శించారు. కాబట్టి మనం ఎటువైపు వెళ్తున్నామో ఆలోచించుకోవాలని తెలిపారు. ‘ఈ దేశం ఎవరి చేతుల్లో ఉందో, ప్రజలు తప్పు దారిలో పయనిస్తున్న తీరు, మనం ఆలోచించాలి. లేదంటే వారు దేశాన్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్తారని నాకు వంద శాతం నమ్మకం ఉంది. మనం దీనిపై దృష్టి పెట్టాలి’ అని అన్నారు.
మరోవైపు 2010లో సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి అమిత్ షాను సొంత రాష్ట్రం నుంచి రెండేళ్లపాటు సుప్రీంకోర్టు నిషేధించింది. అయితే ఈ కేసులో నిర్దోషిగా 2014లో ఆయన విడుదలయ్యారు.
The ‘Tadipaar’ who was banned by the Supreme Court from entering his native state is sitting on the important post of Home Minister.
He has no right to utter a word against me.
— Sharad Pawar pic.twitter.com/GB9XAIAPrJ
— Shantanu (@shaandelhite) July 27, 2024