ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) హైడ్రామా కొనసాగుతోంది. శరద్ పవార్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసి షిండే సర్కార్‌లో అజిత్ పవార్ సహా 9 మంది ఎమ్మెల్యేల చేరిక కలకలం రేపుతోంది. ఫిరాయింపు నేతలపై ఎన్సీపీ బహిష్కరణ వేటు వేయడంతో పాటు వారికి వ్యతిరేకంగా మహారాష్ట్ర స్పీకర్‌కు అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది.
ఇక అజిత్ పవార్ వర్గం ముంబైలో నూతన కార్యాలయం ఏర్పాటు చేయగా అందులో శరద్ పవార్ ఫొటో ఉండటం వివాదాస్పదమైంది. తన అనుమతితోనే తన ఫొటోను వాడాలని శరద్ పవార్ స్పష్టం చేశారు. తన అభిప్రాయాలతో విభేదించేవారు, సైద్ధాంతిక విభేదాలున్న వారు తన ఫొటోను వాడకూడదని మేనల్లుడు అజిత్ పవార్ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు.
అజిత్ పవార్ మంగళవారం ప్రారంభించిన నూతన ఎన్సీపీ కార్యాలయంలో పవార్ ఫొటో కనిపించిన నేపధ్యంలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక తమ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా అజిత్ పవార్ వర్గం ఎంపీ సునీల్ తత్కరేను నియమించగా, ఎన్సీపీ మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్ అని శరద్ పవార్ పునరుద్ఘాటించారు.
Read More :
China Youth | చైనా యువత బెంబేలు.. వయసు 35 దాటితే ఉద్యోగం ఊస్ట్