China Youth | చైనా యువత బెంబేలు.. వయసు 35 దాటితే ఉద్యోగం ఊస్ట్
సాధారణంగా ఎవరికైనా 35 ఏండ్లు వచ్చాయంటే ఉద్యోగం చేస్తూనో, లేదంటే వ్యాపారంలో ఉంటూనో జీవితంలో కుదురుకున్నారని అర్థం. కాబట్టి ఇల్లు, పెండ్లి, పిల్లలు వంటి లక్ష్యాలను చాలా వరకు చేరుకుంటారు.
China Youth | న్యూఢిల్లీ : సాధారణంగా ఎవరికైనా 35 ఏండ్లు వచ్చాయంటే ఉద్యోగం చేస్తూనో, లేదంటే వ్యాపారంలో ఉంటూనో జీవితంలో కుదురుకున్నారని అర్థం. కాబట్టి ఇల్లు, పెండ్లి, పిల్లలు వంటి లక్ష్యాలను చాలా వరకు చేరుకుంటారు. కానీ, చైనాలో ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉన్నది. 35 దగ్గరపడుతున్నదంటే చాలు యువత బెంబేలెత్తిపోతున్నది. చేస్తున్న ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నది. దీని వెనక పెద్ద కారణమే ఉంది. 35 ఏండ్లు దాటిన వారిని ఉద్యోగంలో చేర్చుకునేందుకు కంపెనీలు నిరాకరిస్తున్నాయి. ఆ మాత్రం వయసుకే వారిలో పస అయిపోయిందని భావిస్తున్నాయి. వారిని వదిలించుకుని నవ యువతను చేర్చుకోవాలని భావిస్తున్నాయి. ఇందుకు మరో కారణం కూడా ఉంది.
ప్రొఫెషనల్స్‌తో పోలిస్తే వీరు చాలా తక్కువ జీతానికే లభిస్తుండడం, చెప్పినట్టు వినడంతోపాటు గొడ్డు చాకిరీకి కూడా సిద్ధపడతారన్నది కంపెనీల భావన. వాటి దుష్ట ఆలోచనలతో యువత ఇప్పటి వరకు పెట్టుకున్న లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి. పెండ్లి, పిల్లలు, ఇల్లు, కారు వంటివి ఇక సాధ్యం కాదని నైరాశ్యంలో కూరుకుపోతున్నారు. 35 ఇప్పుడు తమకు శాపంలా మారిందంటూ చైనా సోషల్ మీడియా హోరెత్తిపోతున్నది. సొంత ఇల్లు, పెండ్లి , పిల్లల్ని కనడం లాంటి కలలకు ఫుల్స్టాప్ పెట్టండి.. అదే ఇప్పుడు హ్యాపీ అన్న పోస్టులు దర్శనమిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- china
- jobs
- Marriages
- Social media
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

