Sharad Pawar : మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం మహిళలను మోసం చేస్తున్నదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ‘లడ్కీ బెహన్ ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్ ఫర్ వుమెన్’తో మహిళలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ పథకానికి బడ్జెట్, నిధుల కేటాయింపులపై స్పష్టత లేనేలేదని అన్నారు. షిండే ప్రభుత్వం ఈ పథకానికి స్పష్టతనిచ్చి, ప్రత్యేకంగా నిధులను కేటాయించగలిగితే తమ పార్టీ వ్యతిరేకించదని చెప్పారు.
మహిళల భద్రత, రైతుల ఆందోళన, ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడం లాంటి అంశాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ () కూటమి (ఎన్న్సీపీలోని పవార్ వర్గం, శివసేనలోని ఉద్ధవ్ థాకరే వర్గం, కాంగ్రెస్) శ్వేతపత్రం విడుదల చేసింది. ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బెహన్ ఇన్కమ్ సపోర్టు పథకం ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభమైందని, అమితు ఈ పథకానికి నిధులు సమకూర్చడానికి అవసరమైన ఆర్థిక వనరులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవని ప్రతిపక్షం కూటమి విమర్శించింది.