ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ కలిసి ఒకే వేదికపై కనిపించారు. అయితే కనీసం ఒకరినొకరు పలకరించుకోలేదు. వారెవరో తెలియదు అన్నట్లుగా ప్రవర్తించారు. (Sharad Pawar And Ajit Pawar) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పూణేలోని వసంతదాదా షుగర్ ఇన్సిస్టిట్యూట్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశం, అవార్డుల ప్రదానోత్సవం గురువారం జరిగింది. ఆ సంస్థ అధ్యక్షుడు శరద్ పవార్, ఉపాధ్యక్షుడు దిలీప్ వాల్సే పాటిల్, సంస్థ ట్రస్టీ, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, హర్షవర్ధన్ పాటిల్, జయప్రకాష్ దండేగావ్కర్, ఇతర నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కాగా, వేదికపై అజిత్ పవార్, శరద్ పవార్ పక్కపక్కనే కూర్చొనేలా తొలుత సీటింగ్ ఏర్పాట్లు చేశారు. అయితే వారి సీటింగ్‌ను ఆ తర్వాత మార్చారు. సహకార మంత్రి బాబాసాహెబ్ పాటిల్ వారిద్దరి మధ్యలో కూర్చున్నారు.
మరోవైపు అజిత్ పవార్, శరద్ పవార్ ఈ సందర్భంగా పలకరించుకోలేదు. ఒకరినొకరు పూర్తిగా విస్మరించుకున్నారు. దీంతో ఎన్సీపీని చీల్చి బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్‌తో శరద్ పవార్‌కు మాట్లాడే ఉద్దేశం లేనట్లుగా కనిపించింది.
కాగా, అజిత్ పవార్, శరద్ పవార్ తిరిగి కలుస్తారన్నట్లుగా ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. అయితే ఒకే వేదికను పంచుకున్నప్పటికీ వారిద్దరూ ముభావంగా ఉన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పవార్ కుటుంబంలో విభేదాలు ముగిసే సూచనలు కనిపించడం లేదు.
#WATCH | Maharashtra: NCP-SCP chief Sharad Pawar and Dy CM Ajit Pawar shared stage during the annual general meeting of Vasantdada Sugar Institute in Pune. pic.twitter.com/38LdkF8u71
— ANI (@ANI) January 23, 2025