Anant Geete : శరద్ పవార్ వెన్నుపోటుదారు: అనంత్ గీతే
Anant Geete : శరద్ పవార్‌పై రాయగడ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంత్ గీతే పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు ఆయన వెన్నుపోటు పొడిచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి,,,

ముంబై : శరద్ పవార్‌పై రాయగడ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంత్ గీతే (Anant Geete) పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు ఆయన వెన్నుపోటు పొడిచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి శివసైనికులకు ఏనాటికీ గురువు కాలేరన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న మహా వికాస్ అఘాది ప్రభుత్వం ‘సర్దుబాటు’ మాత్రమే అని అనంత్ గీతే బాంబు పేల్చారు. రాయగడలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
శివసేన-బీజేపీ మధ్య విభేదాల తర్వాత 2019 లో మహా వికాస్ అఘాది ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతకుముందు బీజేపీతో కలిసి శివసేన అధికారాన్ని పంచుకున్నది. ‘ఇప్పుడున్న ప్రభుత్వం సర్దుబాటు మాత్రమే. అయినందున శరద్ పవార్ మా నాయకుడు కాలేడు. మా గురువు ఎప్పటికీ బాలాసాహెబ్ ఠాక్రేనే’ అని చెప్పారు. ఈ ప్రభుత్వం పనిచేస్తున్నంత కాలం మూడు పార్టీల మధ్య సర్దుబాటు కొనసాగుతుందని తెలిపారు. సేన నేతృత్వంలోని ప్రభుత్వంపై తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవని, ఈ ప్రభుత్వం విజయవంతం అవుతుందని అనంత్ గీతే పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సునీల్ తత్కరే చేతిలో స్వల్ప తేడాతో అనంత్ గీతే ఓటమిపాలయ్యారు.
ఇవి కూడా చదవండి..
జలాలాబాద్‌లో 35 మంది తాలిబాన్లు మృతి : ఐసిస్ ఖోరాసన్
పాక్‌లో సివిల్స్‌కు ఎంపికైన హిందూ యువతి
వృద్ధులను వేధిస్తున్న మతిమరుపు సమస్య.. ఎందుకలా?
2-3-4 ఫార్ములాతో బీపీ కంట్రోల్.. ఎలాగంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

