Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Adarsha Kutumbam | టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు విక్టరీ వెంకటేశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ సినిమా మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
Adarsha Kutumbam | టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు విక్టరీ వెంకటేశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ సినిమా మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నంబర్ 47). ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, గతంలో పలుమార్లు విడుదల తేదీ మారిన ఈ చిత్రం, తాజాగా అక్టోబర్ 9న థియేటర్లలోకి రావాల్సి ఉండగా.. మరోసారి వాయిదా పడటం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
సినిమా చివరి దశలో సాంకేతిక పనులు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతోనే విడుదలను వాయిదా వేయాల్సి వచ్చిందని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. ముఖ్యంగా ఫైనల్ ఆడియో మరియు విజువల్ మిక్సింగ్ పనులకు మరింత సమయం అవసరమైందని, సినిమాను హడావుడిగా విడుదల చేసి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మొదట అక్టోబర్ 9న విడుదల కావాల్సిన ఈ సినిమాను, అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఆ తేదీపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వెంకటేశ్‌తో పాటు ఇతర నిర్మాతలతో చర్చలు జరిపిన తర్వాతే కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో వెంకటేశ్ ఒక విభిన్నమైన మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నారు. కుటుంబంలో జరిగే ఆసక్తికర సంఘటనలు, భావోద్వేగాలు, వినోదం మరియు కొన్ని అనూహ్య మలుపులతో ఈ కథ సాగనున్నట్లు ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా స్పష్టమైంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా.. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో అలరించనున్నారు. ఎస్.ఎస్. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి, వెంకీ-త్రివిక్రమ్ కాంబో మ్యాజిక్‌ను తెరపై చూడాలంటే అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇబ్బందులు ఎదురైతే భయపడకుండా తెలుపాలి’
Samantha Ruth Prabhu | తల్లిదండ్రులైన సమంత – రాజ్ నిడిమోరు.. కొడుకుకు ‘దేవ్ నిడిమోరు’ అని నామకరణం!
Harish Rao | రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం పట్టుకుంది : హరీశ్ రావు
Delhi Capitals | దిల్లీ క్యాపిటల్స్‌కు మహేల జయవర్దనే.. తొలి టైటిల్ సాధించేనా..!
ఉర్సు వేడుకలను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కోరం కనకయ్య
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

