Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డు ప్రజలు డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డు ప్రజలు డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో మురుగు నీరు రోడ్లపైకి వచ్చి దుర్గంధంతో నిండిపోతోంది. దోమల బెడద పెరిగి అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టేందుకు మున్సిపల్ శాఖ అధికారులు ముందుకు వస్తున్నప్పటికీ, ఆర్ అండ్ బీ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు.
మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డు వేయడానికి సిద్ధంగా ఉన్నా ఆర్ అండ్ బీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, కనీసం స్పందించడం కూడా లేదని ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా సామాన్య ప్రజలు నరకం అనుభవిస్తున్నారని వాపోతున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆర్ అండ్ బీ శాఖ అధికారులపై చర్యలు తీసుకొని, 10వ వార్డులో తక్షణమే డ్రైనేజీ, రోడ్డు పనులు పూర్తి చేయాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

