అయోధ్య: రామ జన్మభూమిలోని రామాలయంలో పూజలు చేసేందుకు ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆదివారం తిరస్కరించారు. నిర్మాణం పూర్తి కాని దేవాలయంలో తాను పూజలు చేయనని చెప్పారు.
అవిముక్తేశ్వరానంద ఆదివారం అయోధ్య నుంచి గోధ్వజ స్థాపన భారత్ యాత్రను ప్రారంభించారు. అయోధ్యలోని సాధు, సంతులతో సమావేశమయ్యారు. గోరక్షణ కోసం చట్టాలను ఆమోదించాలని డిమాండ్ చేశారు.