ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ విమానాన్ని నడిపిన వారిలో ఓ లేడీ పైలట్ ఉన్నారు. ఆమె పేరు శాంభవి పాటక్(Shambhavi Pathak). లియర్ జెట్ 45 విమానానికి పైలట్ ఇన్ కమాండ్‌గా కెప్టెన్ సుమిత్ కపూర్ ఉన్నారు. సీనియర్ పైలట్ అయిన అతను.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ఇంఛార్జీగా ఉన్నారు. అత్యంత కీలకమైన నిర్ణయాలు ఆ పైలట్ తీసుకుంటారు. టేకాఫ్ , ల్యాండింగ్ అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది. బిజినెస్ జెట్స్‌ను నడపడంలో కపూర్‌కు విశేష అనుభవం ఉన్నది. లియర్‌జెట్ విమానంపై సేఫ్ రిపోర్టు ఉన్నట్లు వీఎస్ఆర్ ఏవియేషన్ సంస్థ పేర్కొన్నది. విమానంలో ఉన్న అయిదుగురు ఆ ప్రమాదంలో దుర్మరణం చెందారు.
మహిళా పైలట్ శాంభవి పాటక్.. ఆ విమానానికి ఫస్ట్ ఆఫీసర్(ఎఫ్‌వో). విమానం కంట్రోలింగ్ కోసం కెప్టెన్ కపూర్‌కు ఆమె సపోర్టు గా ఉన్నారు. కో-పైలట్‌గా ఫ్లయిట్ ఇన్స్ట్రూమెంట్స్ ఆపరేట్ చేస్తుంది. ఏటీసీ తో ఎప్పటికప్పుడు ఆమె కాంటాక్ట్ అవుతుంటుంది. కెప్టెన్ శాంభవి పాటక్.. గ్వాలియర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్కూల్లో చదువుకున్నారు. 2016 నుంచి 2018 మధ్య ఆమె పైలట్ శిక్షణ చేశారు. మధ్యప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్లో ఆమె సభ్యురాలు. అనుభవం ఉన్న పైలట్లతో ఆమె అనేక సార్లు ఛార్టెడ్ విమానాలను నడిపారు.
Capt. Shambhavi Pathak, the pilot of Ajit Pawar’s Learjet 45, has also been reported among the victims of the tragic plane crash today at #Baramati. She studied at No. 1 Air Force School #Gwalior between 2016 and 2018 and was a member of the Madhya Pradesh Flying Club. pic.twitter.com/pmrk3K5V7J
— SouLSteer Gwalior (@SouLSteer) January 28, 2026
ఇక ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో సాహిల్ మాదాన్ అనే వ్యక్తి ఉన్నారు. విమాన సిబ్బంది పాత్రలో సాహిల్ బాధ్యతలు నిర్వర్తించారు. విమాన అటెండెంట్‌గా సాహిల్ ఆ విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. 8.10 నిమిషాలకు ఛత్రపతి శివాజీ టర్మినల్ నుంచి విమానం టేకాఫ్ తీసుకున్నది. 8.45 నిమిషాలకు ఆ విమానం రేడార్ నుంచి మాయమైంది. బారామతి విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ సమయంలో ఆ విమానం చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. కూలిన తర్వాత భారీగా శబ్ధం, మంటలు వచ్చినట్లు స్థానికులు చెప్పారు. కూలిన తర్వాత పలుమార్లు విమానం పేలినట్లు కూడా ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు.