న్యూఢిల్లీ : బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్‌ఖాన్‌ను ఈ ఏడాది అత్యంతస్టైలిష్ వ్యక్తుల్లో ఒకరిగా ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొన్నది. 67 మంది వ్యక్తులతో విడుదల చేసిన జాబితాలో షారూక్‌ను చేర్చింది. షారూక్ ‘మెట్ గాలా’ (ఫ్యాషన్, చారిటీ ఈవెంట్)లో విభిన్న దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించినందుకు ఈ గౌరవం దక్కింది.
న్యూఢిల్లీ: టైమ్స్ ‘సీఈవో ఆఫ్ ది ఇయర్-2025’గా యూట్యూబ్ హెడ్, ప్రవాస భారతీయుడు నీల్ మోహన్ ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ‘సాంస్కృతిక, చారిత్రక, సంప్రదాయ’ ఆహార అలవాట్లకు ‘యూట్యూబ్’ను ఒక వేదికగా చేసినందుకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది.