న్యూఢిల్లీ : వన్యప్రాణి ప్రేమికులకు గూస్బంప్స్ తెప్పించే వీడియోను (Viral Video) వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ షాజ్ జంగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కెమెరా వైపు నేరుగా తదేకంగా చూస్తున్న చిరుత వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది.
ఈ వీడియోను కన్నార్పకుండా చూస్తే గూస్బంప్స్ రావడం ఖాయం. ఈ వీడియోలో చిరుత కండ్లు పూర్తిగా కెమెరాకు అతుక్కుపోయినట్టుగా కనిపిస్తుంది. కన్నార్పకుండా అది స్ట్రెయిట్‌గా చూడటం వైరల్ క్లిప్‌లో కనిపిస్తుంది. చిరుత కండ్లు..! ఆకుల మధ్య నుంచి నిరంతరం చూస్తూనే ఉంటుంది..ఎప్పుడూ మీ తొలి పరిశీలకుడని షాజ్ జంగ్ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 20 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో భయానకంగా ఉండటంతో పాటు అదేసమయంలో సో.. బ్యూటిఫుల్ కూడా అని ఓ యూజర్ కామెంట్ చేశారు. మీపైనే చూపులను బంధించింది అని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :