Fight between Minister, MP | మంత్రి, ఎంపీ గొడవపడ్డారు.. అడ్డొచ్చిన కలెక్టర్‌ను తోసిపడేశారు.. Video
Fight between Minister, MP | మంత్రి, ఎంపీ గొడవపెట్టుకుని అడ్డుచెప్పబోయిన జిల్లా కలెక్టర్‌ను తోసిపడేశారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
చెన్నై: మంత్రి, ఎంపీ గొడవపెట్టుకుని అడ్డుచెప్పబోయిన జిల్లా కలెక్టర్‌ను తోసిపడేశారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. అంతకుముందే ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ రాష్ట్రమంత్రి రాజ కన్నప్పన్కు, స్థానిక ఎంపీ నవాస్ ఖనికి ఆహ్వానాలు పంపించారు.
ఇవాళ ఉదయం మంత్రి రాజకన్నప్పన్ హాజరయ్యే సమయానికి ఎంపీ నవాస్ ఖని ఇంకా రాలేదు. దాంతో మంత్రి, జిల్లా కలెక్టర్ కలిసి అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రారంభించారు. అదే సమయంలో వచ్చిన ఎంపీ నవాస్ ఖని తాను రాకముందే కార్యక్రమాన్ని ఎలా ప్రారంభిస్తారంటూ గొడవకు దిగారు. ఈ సందర్భంగా మంత్రికి, ఎంపీకి, ఆ ఇద్దరి అనుచరులకు మధ్య తోపులాట జరిగింది.
దాంతో అక్కడే ఉన్న కలెక్టర్ గొడవ పడుతున్న నేతలిద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు ఆయనను తోసిపడేశారు. అయితే అక్కడే సోఫా ఉండటంతో ఆయన కింద పడిపోకుండా ఆ సోఫాలో కూలబడిపోయారు. కలెక్టర్ కిందపడిపోయినా మంత్రి, ఎంపీ మాత్రం తమ గొడవను ఆపలేదు. ఇరువర్గాలు అలాగే తోపులాట కొనసాగించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

