ఇండోర్, ఏప్రిల్ 19: సహజీవనం సంస్కృతి కారణంగానే ఇటీవలి కాలంలో లైంగిక నేరాలు, వ్యభిచారం వంటివి పెరిగిపోతున్నాయని మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఇండోర్ బెంచ్ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతీఒక్కరికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నాయి. ఇందులో సహజీవనం ఉండటం ఆందోళనకరమని జస్టిస్ సుబోధ్ అభ్యంకర్ అన్నారు.