తిరువనంతపురం: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాలోని సముద్ర తీరప్రాంత గ్రామం వాలియతురాలో బలమైన అలల తాకిడికి తీరం వెంబడి ఉన్న ఇండ్లు ధ్వంసమయ్యాయి.
అలల తాకిడికి నా ఇల్లు సగం కూలిపోయింది. విపత్తును ముందే పసిగట్టి పెద్ద రాళ్లు తీసుకెళ్లి ఇంటికి సపోర్టుగా పెట్టాను. అయినా అలల ధాటికి ఆ రాళ్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. ఇల్లు కూలిపోయింది అని ఓ బాధితురాలు తన గోడు వెల్లబోసుకుంది.
#CycloneTauktae: Several houses damaged/destroyed in Valiyathura, a coastal village in Kerala's Thiruvananthapuram
— ANI (@ANI) May 16, 2021
"My house has been half-destroyed by strong tides. I am carrying heavy stones one by one to protect my house from being washed away by tides," says a local woman. pic.twitter.com/PnVORgUPSk