సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థలు దర్యాప్తు పూర్తి చేయడానికి న్యాయస్థానాలు విధించే గడువు ప్రతిస్పందనగా మాత్రమే ఉంటుందని, ముందు జాగ్రత్త చర్యగా కాదని సుప్రీంకోర్టు తెలిపింది. అసాధారణ జాప్యం వల్ల ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉన్న కేసుల్లో అరుదుగా ఈ విధంగా గడువు విధించవచ్చునని చెప్పింది. నకిలీ పత్రాలను సృష్టించి ఆయుధాల లైసెన్స్‌ను పొందిన కేసులో అరెస్ట్ నుంచి నిందితులకు అలహాబాద్ హైకోర్టు రక్షణ కల్పించింది. ఈ కేసులో దర్యాప్తును పూర్తి చేయడానికి ఉత్తర ప్రదేశ్ పోలీసులకు 90 రోజుల గడువు విధించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వివరణ ఇచ్చింది.