 
                                                            జైపూర్ : రాజస్ధాన్‌లోని కరణ్‌పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ (Setback for BJP) తగిలింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రూపీందర్ సింగ్ కూనిర్ బీజేపీ అభ్యర్ధి సురేందర్‌పాల్ సింగ్‌పై 11,284 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కరణ్‌పూర్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్ధిని రాజస్ధాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ అభినందించారు.
కరణ్‌పూర్ ప్రజలు బీజేపీ అహంపై దెబ్బకొట్టారని, ఎన్నికల ప్రక్రియ సాగుతుండగానే తమ అభ్యర్ధికి మంత్రి పదవికట్టబెట్టిన కాషాయ పార్టీకి గుణపాఠం నేర్పారని గెహ్లాట్ పేర్కొన్నారు. భజన్‌లాల్ ప్రభుత్వం చేపట్టిన క్యాబినెట్ విస్తరణలో కరణ్‌పూర్ ఉప పోరులో బీజేపీ తరపున పోటీలో నిలిచిన సురేందర్‌పాల్ సింగ్‌కు ఆ పార్టీ మంత్రిగా ప్రమోషన్ కల్పించింది.
ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘనేనని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉప ఎన్నికల్లో అభ్యర్ధిగా బరిలో ఉండగానే మంత్రిని చేయడంపై కాంగ్రెస్ ఆక్షేపించింది. కాగా, ఇటీవల జరిగిన రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 199 స్ధానాలకు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ అభ్యర్ధి గుర్మీత్ సింగ్ ఆకస్మిక మరణంతో కరణ్‌పూర్ నియోజకవర్గంలో ఎన్నికలు వాయిదా వేశారు.
Read More :
Ayodhya Ram Mandir | అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ.. ఆలియా, రణ్‌బీర్‌లకు ఆహ్వానం
 
                            