ముంబై, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఒక సీరియల్ రేపిస్ట్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 16 సంవత్సరాల క్రితం చెవిటి, మూగ బాలికపై అత్యాచారం చేసినందుకు మహేష్ పవార్(51)ను ముంబైలోని కురార్ పోలీసులు ఈ నెల 13న అరెస్టు చేశారు. అతడిని ఈ నెల 20న విచారించగా, సీరియల్ రేపిస్ట్ అన్న విషయం బయటపడింది.
ఇప్పటివరకు ఏడుగురు మహిళలు ముందుకు వచ్చి నిందితుడిపై అత్యాచారం ఆరోపణలు చేశారు. బాధితుల సంఖ్య 24 కంటే ఎకువగా ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు మూగ యువతిని ఇప్పటికీ వేధిస్తుండటంతో ఆమె తన భర్తతో కలిసి కురార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు తనపై అత్యాచారం చేసి వీడియోలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె తెలిపింది.