Solar Eclipse | త్వరలో ఖగోళ ప్రియులను సూర్యగ్రహణం కనువిందు చేయనున్నది. ఇటీవల సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏర్పడనున్న ఆఖరి గ్రహణం ఇదేకానున్నది. ఈ నెల 21న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నది. దక్షిణార్ధగోళంలోని పలు ప్రాంతాల్లో మాత్రమే కనిపించనున్నది. యూనివర్సల్ టైమ్ ప్రకారం రాత్రి 7.43 గంటలకు వరకు గ్రహణం గరిష్ఠ స్థాయికి చేరుతుంది. ఈ గ్రహణం న్యూజిలాండ్, తూర్పు ఆస్ట్రేలియా, దక్షిణ పసిఫిక్ దీవులు, అంటార్కిటికా వంటి ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించనుంది.
న్యూజిలాండ్‌లోని డ్యూనెడిన్ నగరంలో అయితే సూర్యుడు దాదాపు 72శాతం వరకు చంద్రుని ఛాయలోకి వెళ్లే అవకాశముందని ఖగోళ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ఈ గ్రహణం కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, నాసా ఈ గ్రహాన్ని ప్రసారం చేయనున్నది. ఈ సూర్య గ్రహానికి ప్రత్యేక ఉన్నది. సెప్టెంబర్ 22న జరుగనున్న ఈక్వినాక్స్కు ముందే సంభవిస్తుండగా.. దీన్ని ఈక్వినాక్స్ ఎక్లిప్స్‌గా పేర్కొంటున్నారు.
ఈక్వినాక్స్ సమయంలో భూమిపై పగలు, రాత్రి సమయాలు సుమారుగా సమానంగా ఉంటాయి. ఇది ఉత్తరార్ధగోళంలో శరదృతువు ప్రారంభాన్ని, దక్షిణార్ధగోళంలో వసంతాకాల ఆరంభాన్ని ఇది సూచిస్తుంది. ఈ గ్రహణాన్ని ప్రత్యక్షంగా కంటితో చూడకూడదని.. దాంతో కళ్ళకు హానికరమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రత్యేకంగా సోలార్ గ్లాసెస్ వంటి వాటిని ఉపయోగించి చూడొచ్చని చెబుతున్నారు. ఈ గ్రహాన్ని నానా, రష్యాకు చెందిన ఈసా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.