సోమవారం 08 మార్చి 2021
National - Dec 24, 2020 , 11:34:38

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

న్యూఢిల్లీ : భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందం చేసుకోవడంతో లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 297 పాయింట్లు పెరిగి 46,741 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈ బెంచ్‌ మార్క్‌ నిఫ్టీ 90 పాయింట్లు పెరిగి 13,693 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ స్టాక్స్‌ మార్కెట్లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీలో ఓఎన్‌జీసీ నాలుగు పెరిగింది. టాటా మోటార్స్, బజాజ్ ఆటో వరుసగా 3.42శాతం పెరిగింది. గెయిల్, ఎన్‌టీపీసీ, భారతి ఎయిర్‌టెల్, ఐఓసీ, హిందాల్కో, ఇండస్‌ ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, ఎస్‌బీఐ, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, జెఎస్‌డబ్ల్యు స్టీల్, బజాజ్ ఫైనాన్స్‌లు నిఫ్టీలో 1.33శాతం నుంచి 2.11శాతం మధ్య పెరిగాయి. నిఫ్టీలో ఇన్ఫోసిస్ 1.04శాతం క్షీణించింది. విప్రో, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, నెస్లే నష్టాల్లో ఉన్నాయి. 

VIDEOS

logo