53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.. నియామకానికి రాష్ట్రపతి ఆమోదం
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ స్థానంలో నవంబర్ 24న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2027, ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
- నవంబర్ 24న బాధ్యతల స్వీకరణ
- 2027 ఫిబ్రవరి వరకు పదవిలో..
న్యూఢిల్లీ, అక్టోబర్ 30 : సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ స్థానంలో నవంబర్ 24న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2027, ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. సూర్యకాంత్‌ను సీజేఐగా నియమించాలని జస్టిస్ గవాయ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. భారత రాజ్యాంగంలోని అధికారాలను వినియోగించి జస్టిస్ సూర్యకాంత్‌ను సీజేఐగా నియమించడానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఎక్స్‌లో పోస్ట్‌చేశారు. కాగా, హర్యానాకు చెందిన జస్టిస్ సూర్యకాంత్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు.
అంతకుముందు ఆయన పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. న్యాయపరమైన తర్కానికి, సామాజిక న్యాయంపై బలమైన ప్రాధాన్యతకు పేరుగాంచిన ఆయన రాజ్యాంగ ధర్మాసనంలోని అనేక విషయాలలో, పాలన, పర్యావరణ సమస్యలు, రాజ్యాంగ వివరణలపై కీలక తీర్పులలో భాగంగా ఉన్నారు. 14 నెలల పాటు సీజేఐగా ఉండనున్న ఆయన ఎన్నికల సంస్కరణలు, క్రిమినల్ జస్టిస్, డిజిటల్ ప్రైవసీ వంటి ప్రధాన రాజ్యాంగ అంశాలకు సంబంధించిన కేసులలో భాగస్వామి కానున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

