కొచ్చి : కేరళలో కొందరు సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లపై రాక్షసంగా ప్రవర్తించారు. ర్యాగింగ్ పేరుతో దారుణంగా హింసించారు. కొట్టాయంలో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సింగ్ మూడో ఏడాది చదువుతున్న శామ్యూల్ జాన్సన్, జీవ, రాహుల్ రాజ్, రిజిల్ జిత్, వివేక్ అనే విద్యార్థులు కళాశాలలో మొదటి సంవత్సరంలో చేరిన జూనియర్ విద్యార్థులను 4 నెలలుగా ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నారు. కంపాస్ వంటి స్టేషనరీ పరికరాలతో జూనియర్ల శరీరాలపై కాట్లు పెట్టడం, వాటిపై బాడీ లోషన్ పోయడం, దుస్తులు విప్పించడం, మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీయడం వంటి రాక్షస చర్యలకు ఒడిగట్టారు. పోలీసులు ఐదుగురిని అరెస్ట్చేశారు.