న్యూఢిల్లీ: భారత ఆర్మీలో చేరేందుకు నిర్వహించే అగ్నివీర్ పరీక్షలో భాగంగా సైకాలజికల్ టెస్ట్‌ను తప్పనిసరి చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు నుంచి నిర్వహించే పరీక్షల్లో శారీరక ధృఢత్వ పరీక్షతో పాటు ముందుగా 15 నిమిషాల ఆన్లైన్ సైకాలజికల్ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ కొత్త నిబంధనను మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, చంబల్, బుందేల్‌ఖండ్‌లలో నిర్వహించే అగ్నివీర్ ర్యాలీల్లో ప్రవేశపెట్టారు. రక్షణ శాఖ పరిధిలోని సైకాలజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ టెస్ట్‌ను నిర్వహించనున్నారు.