న్యూఢిల్లీ: ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవికి సీనియర్ జర్నలిస్ట్, హార్డ్న్యూస్ సంపాదకుడు సంజయ్ కపూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా ‘ది హిందూ బిజినెస్ లైన్’ మాజీ సంపాదకుడు రాఘవన్ శ్రీనివాసన్, కోశాధికారిగా థంబ్ప్రింట్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్ఈ థెరీసా రెహమాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గిల్డ్ సోమవారం ఓ ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది.