బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రిగా, మొత్తం 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 8 మందిలో డాక్టర్ జీ పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీశ్ జర్కిహోలి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, బీజెడ్ జమీర్ అహ్మద్‌ఖాన్ ఉన్నారు.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీతోపాటు ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వారిలో తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్సింగ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఉన్నారు.
పైవారితోపాటు సీనియర్ పొలిటీషియన్లు శరద్‌పవార్, వామపక్ష నాయకులు సీతారాం ఏచూరి, డీ రాజా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్, పీడీపీ అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, సినీనటుడు కమల్‌హాసన్ తదితరులు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
కాగా, కర్ణాటకలో ఈ నెల 10న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నెల 13న ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 224 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. సీఎం పదవికి సిద్ధూ, డీకే మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ముఖ్యమంత్రి పేరును ఖరారు చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. చివరికి సిద్ధరామయ్యకే సీఎంగా అవకాశం దక్కింది.
#WATCH | Senior Congress leader Siddaramaiah takes oath as the Chief Minister of Karnataka in Bengaluru. pic.twitter.com/S90btY2N6z
— ANI (@ANI) May 20, 2023
#WATCH | DK Shivakumar takes oath as the Deputy Chief Minister of Karnataka, in Bengaluru. pic.twitter.com/b4v3XqeWnx
— ANI (@ANI) May 20, 2023
#WATCH | Congress national president Mallikarjun Kharge and party leaders Rahul Gandhi & Priyanka Gandhi Vadra at the swearing-in ceremony of the newly-elected Karnataka Government, in Bengaluru. pic.twitter.com/kKcgYIMnBY
— ANI (@ANI) May 20, 2023
Bengaluru | Satish Jarkiholi, Priyank Kharge, Ramalinga Reddy and BZ Zameer Ahmed Khan take oath as ministers in the newly-elected Karnataka Government. pic.twitter.com/MGGitd6kyk
— ANI (@ANI) May 20, 2023
#WATCH | Karnataka swearing-in ceremony | Karnataka CM-designate Siddaramaiah and Deputy CM-designate DK Shivakumar display a show of unity with Congress leader Rahul Gandhi in Bengaluru. pic.twitter.com/KxdvpWims1
— ANI (@ANI) May 20, 2023
#WATCH | Rajasthan CM Ashok Gehlot and Karnataka Deputy CM-designate DK Shivakumar share a light-hearted moment at Sree Kanteerava Stadium in Bengaluru.
Swearing-in ceremony to begin shortly. pic.twitter.com/DwZXPMVzzl
— ANI (@ANI) May 20, 2023
Bihar CM Nitish Kumar, Chhattisgarh CM Bhupesh Baghel, Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu, and Bihar Deputy CM Tejashwi Yadav also attend the swearing-in ceremony of the newly-elected Karnataka Government in Bengaluru. pic.twitter.com/tP12AKIoCm
— ANI (@ANI) May 20, 2023
Karnataka swearing-in ceremony | Karnataka CM-designate Siddaramaiah and Deputy CM-designate DK Shivakumar display a show of unity with Congress leader Rahul Gandhi. pic.twitter.com/IRihOfOWJu
— ANI (@ANI) May 20, 2023
Congress national president Mallikarjun Kharge, party leaders Rahul Gandhi, Priyanka Gandhi Vadra and former Madhya Pradesh CM Kamal Nath attend the swearing-in ceremony of the newly-elected Karnataka Government, in Bengaluru. pic.twitter.com/2XlGebPPlT
— ANI (@ANI) May 20, 2023
National Conference president Farooq Abdullah and NCP president Sharad Pawar also attend the swearing-in ceremony of the newly-elected Karnataka Government at Sree Kanteerava Stadium in Bengaluru. pic.twitter.com/sUUAlOHV9a
— ANI (@ANI) May 20, 2023