RCB vs CSK : పదిహేడో సీజన్ ప్లే ఆఫ్స్‌లో ఆఖరి బెర్తు పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ రూపిన పేరు నిలవాలంటే గెలవక తప్పని పోరు. ప్రత్యర్థి ఏమో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK). ఏమాత్రం ఒత్తిడికి లోనైనా మ్యాచ్ చేజారే పరిస్థితి. కానీ, ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) పంజా విసిరింది. వరుస ఓటముల తర్వాత ఫీనిక్స్ పక్షిలా పుంజుకున్న డూప్లెసిస్ సేన అసాధ్యాన్ని సాధ్యం చేసింది. సొంత మైదానంలో ఆల్‌రౌండ్ షోతో సూపర్ కింగ్స్ ఆశలపై నీళ్లు చల్లింది.
ఎవరూ ఊహించని రీతిలో వరుసగా ఆరో విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. తొలుత ఓపెనర్లు ఫాఫ్ డూప్లెసిస్(54), విరాట్ కోహ్లీ(47)ల విధ్వంసానికి రజత్ పాటిదార్(41), కామెరూన్ గ్రీన్(38 నాటౌట్)ల మెరుపు బ్యాటింగ్ తోడవ్వడంతో ఆర్సీబీ భారీ స్కోర్ కొట్టింది. అనంతరం 219 రన్స్ ఛేదనలో చెన్నై 191 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో యశ్ దయాల్ 7 పరుగులే ఇవ్వడంతో ఆర్సీబీ 27 రన్స్ తేడాతో గెలుపొందింది.
𝗥𝗼𝘆𝗮𝗹 𝗖𝗵𝗮𝗹𝗹𝗲𝗻𝗴𝗲𝗿𝘀 𝗕𝗲𝗻𝗴𝗮𝗹𝘂𝗿𝘂 seal the final spot for #TATAIPL 2024 Playoffs ❤️
What a turnaround 🫡
Scorecard ▶️ https://t.co/7RQR7B2jpC#RCBvCSK | @RCBTweets pic.twitter.com/yHS7xnEn8x
— IndianPremierLeague (@IPL) May 18, 2024
తమ కంచుకోటలో ఆర్సీబీ కొండంత స్కోర్ కొట్టింది. నాకౌట్ పంచ్‌తో దర్జాగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. బెంగళూరు నిర్దేశించిన భారీ ఛేదనలో చెన్నై ఇన్నింగ్స్ ఆది నుంచి తడబడుతూ సాగింది. మ్యాక్స్‌వెల్ తొలి బంతికే రుతురాజ్ గైక్వాడ్(0)ను వెనక్కి పంపి చెన్నైని ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ కాసేపటికే కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో డేంజరస్ డారిల్ మిచెల్(4) డగౌట్ చేరాడు.
ఆ దశలో ఓపెనర్ రచిన్ రవీంద్ర(61), అజింక్యా రహానే(33)లు ఆపద్భాందవులుగా మారి.. చెన్నైని పోటీలోకి తెచ్చారు. మూడో వికెట్‌కు 66 రన్స్ జోడించారు. అయితే.. ఈ జోడీని ఫెర్గూసన్ విడదీసి ఆర్సీబీకి బ్రేక్ ఇచ్చాడు. శివం దూబే(7) విఫలమవ్వగా.. ఆఖర్లో రవీంద్ర జడేజా(42 నాటౌట్), ఎంఎస్ ధోనీ(23)లు కాసింత భయపెట్టారు. యశ్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్లో చెన్నై ప్లే ఆఫ్స్ చేరేందుకు 17 రన్స్ అవసరం కాగా.. ధోనీ తొలి బంతికి సిక్స్ కొట్టాడు. ఆ తర్వాతి బంతికి ధోనీ ఔట్ అవ్వడంతో బెంగళూరు ఊపిరి పీల్చుకుంది.
టాస్ ఓడిన బెంగళూరుకు ఓపెనర్లు ఫాఫ్ డూప్లెసిస్(12), విరాట్ కోహ్లీ(19)లు శుభారంభమిచ్చారు. ప్లే ఆఫ్స్ లక్ష్యంగా రెండొందల టార్గెట్ పెట్టుకున్న ఈ ఇద్దరి ఊచకోతకు మూడు ఓవర్లకే స్కోర్ 31కి చేరింది. అయితే.. ఆ తర్వాత వాన రావడంతో ఆర్సీబీ పరుగుల వరదకు బ్రేక్ పడింది. ఇక వాన తగ్గాక బంతి బాగా టర్న్ కావడంతో థీక్షణ, శాంట్నర్ రంగంలోకి దిగారు. దాంతో, ఆర్సీబీ ఓపెనర్లు రన్స్ తీయలేక ఇబ్బంది పడ్డారు. స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత కోహ్లీ(47) భారీ షాట్ ఆడి.. బౌండరీ వద్ద డారిల్ మిచెల్ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దాంతో, 78 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ పడింది. ఆ కాసేపటికే శాంట్నర్.. డూప్లెసిస్‌ను రనౌట్ చేసి బెంగళూరును దెబ్బకొట్టాడు. అయితే.. పాటిదార్(41), గ్రీన్(38)లు వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ స్కోర్ రెండొందలు దాటించారు.
It’s all happening here in Bengaluru 🤯🏟️
19.1 – A 110M SIX
19.2 – O.U.TFollow the Match ▶️ https://t.co/7RQR7B2jpC#TATAIPL | #RCBvCSK pic.twitter.com/1sZvHJHwmW
— IndianPremierLeague (@IPL) May 18, 2024