పాట్నా: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ(72) సోమవారం కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆరోగ్యం సహకరించకనే లోక్సభ ఎన్నికలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. మంగళవారం పాట్నాలోని నివాసంలో ఆయన అంతిమ సంస్కారాలు జరగనున్నట్టు కుటుంబసభ్యులు చెప్పారు. మోదీ రాజ్యసభ ఎంపీగా ఒకసారి, రెండు సార్లు రాష్ట్రమంత్రిగా పని చేశారు.