Plane Crash | జూన్ 12న అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) సంభవించిన విషయం తెలిసిందే. లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్‌పై కుప్పకూలింది. ఈ దుర్ఘటలో దాదాపు 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారి (Air India crash probe officer) భద్రతను కేంద్రం తాజాగా పెంచింది. దర్యాప్తుకు నాయకత్వం వహిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ (Aircraft Accident Investigation Bureau chief) జీవీజీ యుగందర్ (GVG Yugandar)కు ‘ఎక్స్’ కేటగిరీ భద్రత (X category security) కల్పిస్తోంది. బ్యూరో చీఫ్‌కు ముప్పు (threat) పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడంతో హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు టాటా సన్స్ గ్రూప్ అండగా నిలిచింది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు రూ.500 కోట్లతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎయిరిండియాలో 74 శాతం వాటాతో ప్రధాన సంస్థగా ఉన్న టాటా సన్స్ ఏఐ171 ట్రస్ట్ పేరుతో సంస్థను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే టాటా సన్స్, ఎయిరిండియాతో కలిసి బాధిత కుటుంబాలకు రూ.1.25 కోట్ల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రస్తుతం ఏర్పాటు కానున్న ట్రస్ట్‌కు టాటా సన్స్ అధిపతి చంద్రశేఖరన్ చైర్మన్‌గా ఉండనున్నారు.
Also Read..
Helmet | టూవీలర్ కొన్నపుడే రెండు హెల్మెట్లు తప్పనిసరి.. కేంద్రం కీలక ఆదేశాలు జారీ..!
Sharad Pawar | హిందీకి మేం వ్యతిరేకం కాదు.. కానీ ప్రైమరీ స్కూల్ స్థాయిలో వద్దు : శరద్‌పవార్