Bedroom jihadis | శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని భద్రతా సంస్థలు బెడ్రూమ్ జిహాదీల రూపంలో కొత్త ముప్పును ఎదుర్కొంటున్నారు. ఈ జిహాదీలు తుపాకులు, ఇతర మారణాయుధాలను ఉపయోగించరు. ఒక్క రక్తపు చుక్క నేలమీద పడకుండా కార్యకలాపాలను, లక్ష్యాలను చక్కబెట్టుకుంటున్నారు. వీరు ఉపయోగించే ఆయుధాలు కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లు మాత్రమే.
వీటి ద్వారానే వారు నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాలతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడమే కాక, మతపరవిద్వేషాలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో అశాంతి, అల్లకల్లోల పరిస్థితులను తేవడానికి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. భద్రతా దళాలకు తలనొప్పిగా మారిన కంటికి కనిపించని ఈ శత్రువులపై పోరాటానికి వారి మార్గంలోనే వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.