న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు పలు వ్యవసాయ ఉత్పత్తులపై ఫార్వర్డ్ ట్రేడింగ్‌ను నిషేధిస్తూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకొన్నది. ట్రేడింగ్ నిషేధించిన వాటిలో గోధుమ, వడ్లు(బాస్మతీయేతర), శెనగలు, ఆవాలతో పాటు వాటి నుంచి ఉత్పత్తి చేసే వస్తువులు, సోయాబీన్, క్రూడ్ పామాయిల్, పెసలు ఉన్నాయి. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఏడాది పాటు నిషేధం కొనసాగుతుందని సెబీ పేర్కొన్నది.