Watch: క్రాకర్స్ పేల్చడంపై గొడవ.. పెళ్లి వేడుకలో కొట్టుకున్న ఇరు వర్గాలు
వరుడి స్నేహితులు పటాకులు కాల్చారు. అక్కడున్న వధువు బంధువులకు ఇది నచ్చలేదు. వరుడి స్నేహితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. వాగ్వాదం కాస్తా తోపులాటకు దారి తీసింది. ఈ గొడవ మరింత ముదిరింది.
తిరువనంతపురం: క్రాకర్స్ పేల్చడంపై వధు, వరుల వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇది చివరకు కొట్టుకోవడం వరకు దారి తీసింది. దీంతో వివాహ వేడుక రభసగా మారింది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం మెప్పయ్యూర్ పట్టణంలోని వరుడి ఇంటికి పెళ్లి బృందం చేరింది. ఈ సందర్భంగా వరుడి స్నేహితులు పటాకులు కాల్చారు. అయితే అక్కడున్న వధువు బంధువులకు ఇది నచ్చలేదు. వరుడి స్నేహితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. వాగ్వాదం కాస్తా తోపులాటకు దారి తీసింది. ఈ గొడవ మరింత ముదిరింది. దీంతో ఇరు వర్గాలకు చెందిన కొందరు యువకులు కొట్టుకున్నారు.
కాగా, ఇతర బంధువులు, స్థానికులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. గొడవ మరింత పెద్దది కాకుండా కొట్టుకుంటున్న వారిని పెళ్లి వేదిక నుంచి బయటకు పంపారు. చివరకు ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. అయితే పెళ్లిలో జరిగిన ఈ ఘర్షణపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. మరోవైపు ఈ ఫైటింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

