న్యూఢిల్లీ: అవ్వాతాతలు తినే ఆహారం వారి మనవళ్లపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో తేలింది. వారి జన్యు లక్షణాల్లో మార్పునకు దారితీస్తున్నదని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ సైంటిస్టులు కనుగొన్నారు. 8 దశాబ్దాలుగా వంశపారంపర్య జన్యు లక్షణాలపై అధ్యయనం చేపట్టిన సైంటిస్టులు, ఆహార ఎంపికలు కూడా జన్యు మార్పిడికి కారణమవుతున్నట్టు తేల్చారు.
నెదర్లాండ్స్లో నాజీలు ఆక్రమించుకున్న ప్రాంతాల ప్రజల ‘ఎపిజెనిటిక్స్’ను సైంటిస్టులు ఉదహరించారు. 2 వేల కిలో క్యాలరీల శక్తినిచ్చే ఆహారం పొందలేక, కేవలం 400 నుంచి 800 కిలో క్యాలరీల శక్తినిచ్చే ఆహారంతో సరిపుచ్చుకోవటం, వారి పిల్లల జన్యుమార్పిడికి దారితీసిందని సైంటిస్టులు చెబుతున్నారు. పెరుగుదల, అభివృద్ధికి చెందిన ఐజీఎఫ్2 అనే జన్యువుల్లో మార్పులకు కారణమైందని కనుగొన్నారు.