మతపరమైన వస్ర్తాలు తొలగించాకే లోపలికి
బెంగళూరు: హిజాబ్ వివాదం నేపథ్యంలో మూతపడ్డ పాఠశాలలు సోమవారం తెరుచుకున్నాయి. గత వారం రోజులుగా ఉడిపి, దక్షిణ కన్నడ, బెంగళూరు జిల్లాల్లో హిజాబ్ అంశంపై ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. సోమవారం స్కూళ్లలో సాధారణ హాజరు శాతమే నమోదైనదని విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. హైకోర్టు ఆదేశాల మేరకు యాజమాన్యాలు మతపరమైన వస్ర్తాలు తొలగించాకే విద్యార్థులను తరగతుల్లోకి అనుమతించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అన్ని పాఠశాలలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు.
బీజేపీ పాలనలో ముస్లింలు సురక్షితం
యూపీ బీజేపీ ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నామని ముస్లిం మహిళలు భావిస్తున్నారు. ముస్లిం మహిళలు ఇండ్ల నుంచి బయటకు వచ్చి బీజేపీకే మద్దతు ప్రకటిస్తున్నారు.
-సోమవారం కాన్పుర్ దెహాత్ సభలో ప్రధాని మోదీ
నేను గెలిస్తే ముస్లింలకు తిలకం పెట్టిస్తా
నేను ఎమ్మెల్యేగా మళ్లీ గెలిస్తే ముస్లింలకు తిలకం (బొట్టు) పెట్టిస్తా. వాళ్లు పెట్టుకొనే గోల్ టోపీలను కనిపించకుండా చేస్తా. నన్ను ఓడించాలని ముస్లింలు ప్రయత్నిస్తే, మౌనంగా మాత్రం ఊరుకోబోను.
-యూపీ బీజేపీ ఎమ్మెల్యే రాఘవేంద్రసింగ్