చెన్నై: తమిళనాడులో దారుణం జరిగింది. తంజావూర్ జిల్లాలో 26 ఏళ్ల స్కూల్ టీచర్ రమణి హత్యకు(School Teacher Murdered) గురైంది. 30 ఏళ్ల మదన్ అనే వ్యక్తి ఆమెను హతమార్చాడు. వివరాల్లోకి వెళ్తే.. మల్లీపట్టణం గవర్న్మెంట్ స్కూల్లో రమణి టీచర్‌గా పనిచేస్తున్నది. అయితే ఇటీవల రమణి, మదన్ కుటుంబ సభ్యులు పెళ్లి కోసం చర్చలు జరిపారు. కానీ పెళ్లి ప్రపోజల్‌ను రమణి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆవేశానికి గురైన మదన్.. ఆమెపై అటాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తిగతమైన కక్షతో మదన్ దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, అతన్ని విచారిస్తున్నారు. మెడలో తీవ్రగాయాలైన రమణిని.. ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది. పెళ్లికి రమణి నిరాకరించడంతో.. ఆమె స్కూల్‌కు వెళ్లిన మదన్.. తన చేతుల్లో ఉన్న పదునైన ఆయుధంతో మెడపై అటాక్ చేశాడు.