చెన్నై: కొందరు విద్యార్థులు బస్టాండ్ వద్ద కొట్టుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఒండిపుదూర్ బస్టాండ్ వద్ద ఇద్దరు స్కూల్ విద్యార్థులపై కొందరు స్టూడెంట్స్ దాడి చేశారు. దీంతో మరి కొందరు జోక్యం చేసుకోవడంతో పెద్ద ఘర్షణకు దారి తీసింది. అంతా చూస్తుండగానే విద్యార్థులు కొట్టుకున్నారు. వారి యూనిఫాం ఆధారంగా ప్రభుత్వ స్కూల్‌కు చెందిన విద్యార్థులుగా గుర్తించారు.
అలాగే బుధవారం చెన్నైలోని కొత్త వాషర్‌మెన్‌పేట బస్టాండ్ వద్ద కాలేజీ విద్యార్థినుల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో మహిళా విద్యార్థులు జట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వెంటనే అక్కడకు వచ్చిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. హెచ్చరించి వారిని వదిలేశారు.
మరోవైపు బస్సు ఫుట్‌బోర్డుపై ప్రయాణించే కొందరు విద్యార్థులు ఇతర ప్రయాణికులు, టీచర్లపై వేధింపులకు పాల్పడ్డారు. కొందరు క్లాస్‌లో టీచర్లపై దాడికి యత్నించారు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసిన ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబు ఈ ఘటనలపై స్పందించారు. తాను కూడా ప్రభుత్వ స్కూల్లో చదివానని గుర్తు చేశారు. మన తల్లిదండ్రులకు స్తోమత లేక ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదివిస్తున్నారని అన్నారు. దీంతో మన సంపద అంతా తరగతిలోని డెస్క్‌లు, చైర్లు అని తెలిపారు. వీటిని మనం ఎలా ధ్వంసం చేస్తాం అని ఆయన ప్రశ్నించారు.
మన భవిష్యత్తు కోసం శ్రమించే టీచర్లపై ఎందుకు దాడి చేస్తున్నారు? అని డీజీపీ శైలేంద్ర బాబు నిలదీశారు. ఇలాంటి చర్యలకు పాల్పడ్డవద్దని విద్యార్థులకు హితవు పలికారు. టీచర్లను గౌరవించాలని, చదువుపై దృష్టిసారించాలని విద్యార్థులకు సూచించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఒక వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు.
Very good advice 👍#Sylendrababu #school #Discipline#Video https://t.co/VVJ9cRIwc6
— ꧁༒☬𝓡𝓪𝓳𝓮𝓼𝓱☬༒꧂ (@rnrajesh23) April 27, 2022