న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్నేండ్ల క్రితం వెలుగుచూసిన లైంగికదాడి కేసులో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దాదాపు 21 మంది విద్యార్థులపై లైంగికదాడికి పాల్పడిన కేసులో హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ ప్రధానోపాధ్యాయుడితోపాటు మరో మహిళా టీచర్‌కు 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
పోక్సో చట్టం కింద నిందితుడికి మరణశిక్ష విధించటం దేశంలో ఇదే మొదటిసారి. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో లైంగిక దాడుల వ్యవహారం 2022లో బయటపడింది. ప్రభుత్వం ‘సిట్’ విచారణకు ఆదేశించగా, ఈ దర్యాప్తులో వార్డెన్ అరాచకాలు బయటపడ్డాయి. 2014-22 మధ్యకాలంలో 21 మంది మైనర్లపై లైంగికదాడులు, వేధింపులకు అతడు పాల్పడినట్టు తేలింది. లైంగికదాడికి పాల్పడేముందు బాధితులకు వార్డెన్ మత్తుమందు ఇచ్చేవాడని వెల్లడైంది.