న్యూఢిల్లీ : భర్త, సంతానం లేని హిందూ మహిళలు వీలునామా రాయాలని సుప్రీంకోర్టు చెప్పింది. వీలునామా రాయని హిందూ మహిళ మరణిస్తే, ఆమె పుట్టింటి వారు, అత్తింటి వారి మధ్య వివాదాలను నివారించడానికి వీలునామా ఉపయోగపడుతుందని తెలిపింది. హిందూ వారసత్వ చట్టం,1956ను ప్రస్తావిస్తూ, మహిళలకు స్వార్జిత ఆస్తులు ఉండవని ఆ రోజుల్లో పార్లమెంటు భావించి ఉండవచ్చునని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మన దేశంలో హిందూ మహిళలు సహా మహిళలు విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని, సొంత ఆస్తులు సంపాదిస్తున్నారని గుర్తు చేసింది. సొంత ఆస్తిని సంపాదించిన హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణించినట్లయితే, ఆ ఆస్తులను ఆమె భర్త తరపు వారు మాత్రమే వారసత్వంగా పొందాలంటే, ఆమె పుట్టింటి తరపు వారికి గుండె మంటగా ఉండవచ్చునని తెలిపింది. ఈ విషయంలో తామేమీ వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది.