న్యూఢిల్లీ: యూపీలోని మథురలో కృష్ణ జన్మభూమి సమీపంలో అక్రమ కట్టడాలంటూ రైల్వే అధికారులు చేపట్టిన కూల్చివేతలకు సుప్రీంకోర్టు బుధవారం బ్రేక్ వేసింది. మరో 10 రోజుల పాటు కూల్చివేతలు నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
కృష్ణ జన్మభూమి సమీపంలో రెండు శతాబ్ధాలకు పైగా నాటి నుంచి చాలా మంది బస్తీవాసులు ఇండ్లు కట్టుకుని ఉంటున్నారు. అయితే అది రైల్వే స్థలమని, అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ రైల్వే శాఖ నోటీసులు జారీ చేసింది. అనంతర పరిణామాల్లో అక్కడి ఇళ్ల కూల్చివేతను ప్రారంభించింది.