Navneet Kaur | సుప్రీంకోర్టులో అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు భారీ ఊరట
Navneet Kaur | మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ (Navneet Kaur)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో భారీ ఊరట లభించింది.
Navneet Kaur | మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ (Navneet Kaur)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో భారీ ఊరట లభించింది. క్యాస్ట్ సర్టిఫికెట్ (caste certificate) పై నవనీత్ కౌర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నవనీత్ కౌర్ ఎస్సీ కాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును (Bombay HC verdict) అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.
నవనీత్ 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. శివసేన అభ్యర్థి ఆనందరావుపై విజయం సాధించారు. అయితే, ఆమె నకిలీ పత్రాలతో ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం పొందారని శివసేన మాజీ ఎంపీ ఆనందరావు ఆరోపించారు. ఈ మేరకు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణ పత్రం అబద్ధమని గుర్తించింది. ఈ మేరకు ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడంతో పాటు రూ.2 లక్షల జరిమానా విధించింది.
అయితే, బాంబే హైకోర్టు తీర్పుపై నవనీత్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. తన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తాజాగా నవనీత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేసింది.
Also Read..
Sonia Gandhi | తొలిసారి పెద్దల సభకు సోనియా గాంధీ.. రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం
Borewell | 18 గంటల పాటు శ్రమించి.. బోర్వెల్లోపడిన రెండేళ్ల బాలుడిని రక్షించిన అధికారులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

