Byjus Raveendran | ఏడాది క్రితం రూ.17వేల కోట్లకు అధిపతి.. ఇప్పుడు జీరో.. బైజూస్ రవీంద్రన్ పరిస్థితి ఇదీ..!
Byjus Raveendran | ఏడాది క్రితం ఇదే సమయానికి వేల కోట్లకు అధిపతిగా బైజూ రవీంద్రన్ (Byjus Raveendran) ఇప్పుడు ఏకంగా జీరోకు పడిపోయారు.
Byjus Raveendran | ఒకప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్టెక్ కంపెనీగా ఉన్న బైజూస్ (Byjus) ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర ద్రవ్య కొరతను ఎదుర్కొంటోంది. సంస్థలోని ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. ఒకానొక సమయంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు తాను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని కూడా తాకట్టు పెట్టేందుకు బైజూస్ రవీంద్రన్ (Byjus Raveendran) సిద్ధపడ్డాడు. అంతేకాదు విలువైన ఆస్తులనుకూడా అమ్ముకున్నట్లు తెలిసింది.
అయితే, గతేడాది ఇదే సమయానికి ఆయన వేల కోట్లకు అధిపతిగా ఉన్నారు. రూ.17వేల కోట్ల నెట్ వర్త్తో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు గడించాడు. ప్రపంచ కుబేరుల జాబితా ఫోర్బ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఒక్క ఏడాదిలో అంతా తారుమారైపోయింది. వేల కోట్లకు అధిపతి నుంచి చేతిలో రూపాయి కూడా లేని దుస్థికి చేరడం గమనార్హం. తాజా ఫోర్బ్స్ జాబితాలో రవీంద్రన్ నికర విలువ ఏకంగా సున్నాకి పడిపోయింది.
2011 లో రవీంద్రన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. ఆన్ లైన్లో పాఠాలు బోధించే ఈ స్టార్టప్‌కు తొలినాళ్లలో ఆదరణ అంతంత మాత్రంగానే ఉండేది. అయితే, కరోనా కాలంలో ఈ సంస్థకు దశ తిరిగింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో బైజూస్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. 2022లో ఏకంగా 22 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో రవీంద్రన్ ప్రపంచ కుబేరుడిగా అవతరించాడు.
అయితే, కంపెనీ అనుసరించిన విధానాలు, సీఈవోగా రవీంద్రన్ తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టి కంపెనీని నష్టాల్లోకి నెట్టాయి. ఎంత వేగంతో పైకి ఎదిగిందో.. అదే వేగంతో ఒక్కసారిగా బైజూస్ విలువ కుప్పకూలిపోయింది. వేల కోట్లకు అధిపతి అయిన ఆయన ఏడాది కూడా తిరగకముందే జీరోకు పడిపోవడం గమనార్హం. 2024-ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా ( Forbes Billionaire Index 2024)ను బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో బైజూస్ అధినేత రవీంద్రన్ తో పాటు మరో ముగ్గురు ప్రపంచ కుబేరుల స్థానం నుంచి చోటు కోల్పోయినట్లు ఫోర్బ్స్ తెలిపింది. 2022లో 22 బిలియన్ డాలర్ల నెట్ వర్త్తో ఉన్న బైజూస్ సీఈవో.. ఈ ఏడాది 1 బిలియన్ కన్నా తక్కువకు పడిపోయిందని ఫోర్బ్స్ తన రిపోర్టులో వెల్లడించింది.
ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. భారత్ అగ్రశ్రేణి బిలియనీర్లు వీరే
- ముకేశ్ అంబానీ – 116 బిలియన్ డాలర్లు
- గౌతం అదానీ – 84 బిలియన్ డాలర్లు
- శివ నాడార్ – 36.9 బిలియన్ డాలర్లు
- సావిత్రి జిందాల్ – 33.5 బిలియన్ డాలర్లు
- దిలిప్ షాంఘ్వి – 26.7 బిలియన్ డాలర్లు
- సైరస్ పూనావాలా – 21.3 బిలియన్ డాలర్లు
- కుషాల్ పాల్ సింగ్ – 20.9 బిలియన్ డాలర్లు
- కుమార్ బిర్లా – 19.7 బిలియన్ డాలర్లు
- రాధాకిషన్ దమానీ – 17.6 బిలియన్ డాలర్లు
- లక్ష్మీ మిట్టల్ – 16.4 బిలియన్ డాలర్లు
Also Read..
Rahul Gandhi | రాహుల్ గాంధీ మొత్తం ఆస్తి విలువ రూ.20 కోట్లు.. సొంత కారు కూడా లేదు..!
Japan Earthquake | జపాన్ను వణికించిన భారీ భూకంపం
Congress | కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి రాజీనామా
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

