Rahul Gandhi | రాహుల్ గాంధీ మొత్తం ఆస్తి విలువ రూ.20 కోట్లు.. సొంత కారు కూడా లేదు..!
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) తనకు రూ.20 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) వరుసగా రెండోసారీ కేరళ (Kerala)లోని వయనాడ్ (Wayanad) లోక్‌సభ (Lok Sabha elections) అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు రూ.20 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అందులో రూ.9.24 కోట్ల చరాస్తులు, రూ. 11.15 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్ (affidavit)లో పొందు పరిచారు.
అయితే, రూ.20 కోట్ల నికర సంపద ఉన్నప్పటికీ ఆయనకు సొంత కారుగానీ, రెసిడెన్షియల్ ఫ్లాట్ కానీ లేకపోవడం గమనార్హం. రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. చరాస్తుల్లో రూ.4.33 కోట్లు బాండ్లు-షేర్ల రూపంలో, రూ.3.81 కోట్లు మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నట్లు తెలిపారు. తన వద్ద రూ.55వేల నగదు, రూ.26.25లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ.15.21 లక్షల విలువైన గోల్డ్ బాండ్లు, రూ.4.20 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు.
స్థిరాస్తుల్లో ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతంలో సోదరి ప్రియాంకగాంధీతో కలిసి వ్యవసాయభూమి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ వ్యవసాయ భూమి తనకు వారసత్వంగా వచ్చిందని రాహుల్ అఫిడవిట్లో వెల్లడించారు. దీంతోపాటుగా గురుగ్రామ్‌లో రూ. 9 కోట్లకుపైగా విలువైన ఆఫీస్ స్పేస్ ఉందని తెలిపారు. అదేవిధంగా తనపై ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలను కూడా రాహుల్ అఫిడవిట్లో పొందుపరిచారు. ఇక 2022-23లో తన వార్షిక ఆదాయం రూ.కోటిగా ప్రకటించారు.
Also Read..
Japan Earthquake | జపాన్ను వణికించిన భారీ భూకంపం
Road Accident | పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
LJP | లోక్‌సభ ఎన్నికల వేళ ఎల్జేపీకి ఎదురుదెబ్బ.. 22 మంది సీనియర్ నేతల ముకుమ్మడి రాజీనామా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

