Japan Earthquake | జపాన్ను వణికించిన భారీ భూకంపం
Japan Earthquake | తూర్పు ఆసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. బుధవారం ఉదయం తైవాన్ (Taiwan)ను శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. తాజాగా జపాన్‌లో భూకంపం సంభవించింది (Japan Earthquake).
Japan Earthquake | తూర్పు ఆసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. బుధవారం ఉదయం తైవాన్ (Taiwan)ను శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. తాజాగా జపాన్‌లో భూకంపం సంభవించింది (Japan Earthquake). గురువారం ఉదయం హోన్షు తూర్పు తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (European-Mediterranean Seismological Centre) తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది.
భూమికి 32 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం తెలియరాలేదు. జపాన్ రాజధాని టోక్యో (Tokyo)లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
కాగా, తైవాన్‌లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు తైవాన్ భూకంప పరిశీలన సంస్థ గుర్తించగా, 7.4 తీవ్రతతో నమోదైనట్టు అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది. 25 ఏండ్లలో అతి పెద్ద భూకంపం ఇదే అని స్థానిక అధికారులు తెలిపారు. హువాలియన్ నగరానికి నైరుతి దిశగా 18 కిలోమీటర్ల దూరంలో, 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపం ధాటికి 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. భారీ భూకంపం తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం, ప్రకంపనలు సంభవించాయి. భూకంపం ధాటికి తైవాన్ రాజధాని తైపీ సహా అనేక ప్రాంతాల్లో భవనాలు బీటలు వారాయి.
Also Read..
Health Tips | తప్పు చేయకండి.. ఎండలో అవి అవసరాలు కాదు.. అనర్థాలు!
Nalgonda | వాటర్ ట్యాంక్‌లో 30 కోతుల కళేబరాలు.. మూడు రోజులుగా ప్రజలకు ఆ నీరే సరఫరా
Earth | భూమి లోపల మహాసముద్రం.. 700 కిలోమీటర్ల లోతులో భారీగా నీరు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

