Health Tips | తప్పు చేయకండి.. ఎండలో అవి అవసరాలు కాదు.. అనర్థాలు!
ఎండాకాలం వచ్చిందంటే చర్మానికీ, శరీరానికీ అవసరాలు మారతాయి. దానికి తగ్గట్టు కొన్ని విషయాల్లో మనమూ మారతాం. అక్కడే తప్పు చేసే అవకాశం ఉంది. ఇవి అవసరాలు కాదు,అనర్థాలు అంటున్నారు చర్మ, ఆరోగ్య నిపుణులు.
Health Tips | ఎండాకాలం వచ్చిందంటే చర్మానికీ, శరీరానికీ అవసరాలు మారతాయి. దానికి తగ్గట్టు కొన్ని విషయాల్లో మనమూ మారతాం. అక్కడే తప్పు చేసే అవకాశం ఉంది. ఇవి అవసరాలు కాదు,అనర్థాలు అంటున్నారు చర్మ, ఆరోగ్య నిపుణులు.
ఇంట్లో అక్కర్లేదు
సన్‌స్క్రీన్ బయటికెళ్లేప్పుడు మాత్రమే రాసుకోవాలి. ఇంట్లో ఉన్నా, కారులో వెళ్తున్నా అక్కర్లేదు అనుకోవడం అపోహ మాత్రమే. మనం ఎక్కడ ఉన్నా మన చుట్టూ ఉండే వెలుతురులో చర్మానికి హాని చేసే అతినీల లోహిత కిరణాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ సమయంలో సన్‌స్క్రీన్ వాడాలి.
కడుగుతూనే ఉండాలి
ఎండాకాలం వచ్చిందంటే అదేదో యాడ్‌లో ‘కడుగు బాబు కడుగు’ అన్నట్టు మొహాన్ని మాటి మాటికీ నీళ్లతో కడుగుతుంటారు. ఇది ఎండవేళ చర్మానికి హాయిని కలిగించి, తేమగా ఉంచుతుందని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఇలా మాటిమాటికీ నీటితో చర్మాన్ని కడగడం వల్ల ‘ట్రాన్స్ ఎపిడెర్మల్ వాటర్ లాస్ (టీఈడబ్ల్యూఎల్)’ అని పిలిచే ప్రత్యేక పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో చర్మం తేమను కోల్పోయి పొడిబారుతుంది.
అదైతే చాలు
వేసవిలో ఏ వీధి మూలన చూసినా మజ్జిగ, పుదీనా రసం కుండలు, జీరా నీళ్లు, నిమ్మరసాలు దొరుకుతుంటాయి. ఎండవేళ చలువ చేస్తాయన్న ఉద్దేశంతో వాటిని స్వేచ్ఛగా తాగుతుంటారు. కానీ, ఇలా బయట దొరికేవి తాగేప్పుడు అక్కడ ఎంత పరిశుభ్రత పాటిస్తున్నారు, ఎలాంటి నీళ్లు వాడుతున్నారులాంటివి గమనించాలి. లేకపోతే పొట్టకు లేనిపోని తంటా తెచ్చినట్టే.
అన్నీ తాగొచ్చు
ఎండవేళ శరీరంలో నీటి స్థాయుల్ని నిలిపి ఉంచేందుకు ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి మంచీ చెడులతో సంబంధం లేకుండా ఏమైనా తాగొచ్చు అనుకోవడం పొరపాటు. కేవలం మజ్జిగ, కొబ్బరినీళ్లలాంటి సంప్రదాయ ఆరోగ్యకర పానీయాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. మిల్క్‌షేక్‌లు, శీతల పానీయాల్లాంటి హై క్యాలరీ డ్రింకులను ఏ కాలంలో అయినా పక్కన పెట్టేయాల్సిందే.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

