LJP | లోక్‌సభ ఎన్నికల వేళ ఎల్జేపీకి ఎదురుదెబ్బ.. 22 మంది సీనియర్ నేతల ముకుమ్మడి రాజీనామా
లోక్‌సభ ఎన్నికలకు ముందు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జన శక్తి పార్టీ (LJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి 22 మంది సీనియర్ నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
పాట్నా: లోక్‌సభ ఎన్నికలకు ముందు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జన శక్తి పార్టీ (LJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి 22 మంది సీనియర్ నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఎంపీ టికెట్లను పార్టీ నాయకత్వం అమ్ముకుంటున్నదని ఆరోపించారు. తామంతా ఇండియా కూటమికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. కాగా, ఎల్జేపీ ప్రస్తుతం ఎన్డీయేలో (NDA) భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.
రాజీనామా చేసినవారిలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, బీహార్ మాజీ మంత్రి రేణు కుశ్వాహా, మాజీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్, రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్, రవీంద్ర సింగ్ వంటి కీలక నేతలు ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. చిరాగ్ పాశ్వాన్తోపాటు ఆయన సన్నిహితులు సీట్లను అమ్ముకుంటున్నారని అందులో పేర్కొన్నారు. సమస్తీపుర్, ఖగడియా, వైశాలి లోక్‌సభ స్థానాల కోసం రూ.కోట్లు తీసుకున్నారన్నారని ఆరోపించారు. బయట నుంచి వచ్చిన వారికి కాకుండా పార్టీకోసం పనిచేస్తున్న నేతలకు టికెట్లు ఇవ్వాలడి డిమాండ్ చేశారు. ఇక దేశాన్ని రక్షించాలంటే ఇండియా కూటమికి అండగా నిలవాల్సిందేనని, తామంతా విపక్ష కూటమికి మద్దతివ్వబోతున్నాం వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Chirag paswan
- INDIA bloc
- LJP
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

