Home
National
Sc Declines To Consider A Plea Seeking A Direction To The Ec To Remove Symbols From Ballot And Evms
ఈవీఎంలలో మార్పులకై దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
Supreme Court | ఎన్నికల సందర్భంగా బ్యాలట్ పత్రాలు, ఈవీఎంలలో మార్పులు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘానికి సూచనలు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను
న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా బ్యాలట్ పత్రాలు, ఈవీఎంలలో మార్పులు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘానికి సూచనలు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను దేశ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బ్యాలట్ పేపర్లు, ఈవీఎంలలో పార్టీ గుర్తులకు బదులుగా అభ్యర్థి పేరు, వయసు, విద్యార్హతలు, ఫొటో ఉంటే బాగుంటుందని, ఆ మేరకు మార్పులు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు.
కానీ ఆ పిటిషన్ను పరిగణలోకి తీసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పార్టీల పేర్లతో కాకుండా అభ్యర్థులు తమ సొంత అర్హతలతో పోటీ చేసేలా ఎన్నికల వ్యవస్థను మార్చాలనే ఉద్దేశంతో పిటిషనర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పిటిషనర్ కోరిన మార్పులు చేయడానికి సాంకేతికంగానే కాకుండా పలు రకాలుగా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

