అజీం ప్రేమ్‌జీని ప్రశంసించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తనపై పదుల సంఖ్యలో తప్పడు కేసులు పెట్టిన వ్యక్తిని క్షమించిన విప్రో మాజీ చైర్మన్ అజీం ప్రేమ్‌జీని సుప్రీంకోర్టు తాజాగా ప్రశంసించింది. అతని గత ప్రవర్తనను క్షమించడంలో ప్రేమ్‌జీ నిర్మాణాత్మక దృక్పథాన్ని తీసుకున్నారని జస్టిస్ సంజయ్ కౌల్, ఎంఎం సుంద్రేశ్ ధర్మాసనం పేర్కొన్నది. ఆర్ సుబ్రమణియన్ అనే వ్యక్తి తన కంపెనీల ద్వారా ప్రేమ్‌జీతో పాటు ఆయన సహచరులపై 70కి పైగా కేసులు పెట్టారు. కర్ణాటక హైకోర్టు రెండు నెలల క్రితం సుబ్రమణియన్‌ను కోర్టు ధిక్కరణ కింద దోషిగా కూడా తేల్చింది. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సుబ్రమణియన్ ఇంతకుముందే ఆదేశించిన సుప్రీంకోర్టు.. దయతో కూడిన నిర్ణయం తీసుకునేలా ప్రేమ్‌జీని ఒప్పించాలని సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఎస్ గణేశ్‌లను కోరింది.